దేవరకొండ, అగస్టు 26 : వినాయక చవితిని ప్రశా ంత వాతావరణంలో నిర్వహించుకోవాలని దేవరకొండ డీఎస్పీ నాగేశ్వర్రావు అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి విగ్రహం వద్ద ఒక్క ఇన్చార్జిని నియమించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, ఆర్డీఓ గోపీరాం, సీఐ శ్రీనివాస్, కమిషనర్ వెంకటయ్య, నాయకులు నక్క వెంకటేశ్‌యాదవ్, ఇలియాస్ పటేల్, కౌన్సిలర్ రౌస్, సైదులు, లింగయ్య పాల్గొన్నారు.
తిప్పర్తి : వినాయక చవితి వేడుకలను మండలంలో శాంతియుతంగా నిర్వహింకోవాలని శాలిగౌరారం సీఐ రాఘవరావు కోరారు. స్థానిక పోలీస్ స్టేషన్లో శుక్రవారం నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గణేశ్ మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి, ఎస్ఐ సత్యనారాయణ, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి
కట్టంగూర్ : మండలంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్ఐ దాచేపల్లి విజయ్‌కుమార్ అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ఏర్పాటు చేసే విగ్రహాల వివరాలను పోలీసులకు తెలుపాలన్నారు. ప్రధాన కూడళ్ల వద్ద రాకపోకలకు ఇబ్బందుల్లేకుండా మండపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎంపీపీ జె ల్లా ముత్తి లింగయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గుర్రం సైదులు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పాలడుగు హరికృష్ణ, ఏఎస్ఐ రాధారపు అం జయ్య, నకిరేకల్ మా ర్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
మర్రిగూడలో..
మర్రిగూడ : మండలంలోని ప్రజాప్రతినిధులు, గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో స్థానిక పోలీ స్ స్టేషన్లో ఎస్ఐ సైదాబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరాత్రుల పర్యవేక్షణకు గ్రామాలకు ప్రత్యేక పోలీస్ అధికారులను అందుబాటులో ఉంచుతామన్నారు. డీజే సౌండ్‌కు అనుమతి లేదని విద్యుత్ కనెక్షన్‌కు కూడా అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. సమావేశంలో జడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డి, సర్పంచ్ నల్ల యా దయ్య, ప్రజాప్రతినిధులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు.
శాలిగౌరారంలో..
శాలిగౌరారం: గణేశ్ ఉత్సవాల నిర్వాహణపై స్థానిక పోలీస్ స్టేషన్లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సతీశ్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసే గణేశ్ ఉత్సవాల వివరాలను
నార్కట్‌పల్లిలో..
నార్కట్‌పల్లి : మండలకేంద్రంలోని పోలీస్ స్టేషన్లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు.
కనగల్‌లో..
కనగల్ : మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ నగేశ్ మాట్లాడుతూ ఉత్సవాలు నిర్వహించే భక్తులు మొదటగా ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలన్నారు. రాత్రి 10 గంటల తర్వాత మండపాల వద్ద మైక్సెట్లను బంద్ చేయాలన్నారు. సమావేశంలో ఎంపీపీ కరీంపాషా, సర్పంచులు, ఎంపీటీసీలు సిబ్బంది పాల్గొన్నారు.