కొండమల్లేపల్లి, డిసెంబర్ 15: బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్, వార్డు సభ్యులను పంచాయతీ ఎన్నికల్లో గెలిపించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ కోరారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటడిగే హక్కులేదని అన్నా రు. ఈ నెల 17న మూడో విడతలో నియోజకవర్గంలో జరిగే 231 పంచాయతీలకు జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ‘నమస్తే తెలంగాణ’ తో మా ట్లాడారు. రెండేండ్ల పాలనలో కాంగ్రెస్ గ్రామీ ణ ప్రాంతాలను, గ్రామ పంచాయతీలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. కేసీఆర్ పదేం డ్ల పాలనలో చేసిన అభివృద్ధి పనులే ఇప్పటికీ జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గంలో కనిపిస్తున్నాయని చెప్పారు.
గ్రామాలను అభివృద్ధి చేసింది కేసీఆర్
ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన దేవరకొండ నియోజకవర్గంలోని గ్రామాలను, తం డాలను కేసీఆర్ పదేండ్ల పాలనలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేశారన్నారు. జిల్లా వ్యాప్తంగా గిరిజన జనాభా 1,95,614 ఉం ది. గతంలో ఉమ్మడి నల్లగొండ ఉన్నప్పుడు 1,176 గ్రామ పంచాయతీలుండగా అం దులో గిరిజనులకు కేవలం 134 గ్రామపంచాయతీలను రిజర్వు చేశారన్నారు. నల్లగొండ జిల్లాలో అయితే 70 గ్రామ పంచాయతీలను మాత్రమే గిరిజనులకు కేటాయించారు. అయి తే పరిపాలనా సౌలభ్యం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలో 349 కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడంతో పాటు దేవరకొండ నియోజకవర్గంలో 300 జనాభా ఉన్న 104 తండాలను పంచాయతీలుగా చేసిందన్నారు. ఈ ఘనత కేసీఆర్‌దేనన్నారు.
పల్లెల్లో పడకేసిన అభివృద్ధి..
కాంగ్రెస్ పాలనలో పల్లెల్లో అభివృద్ధి పడకేసిందన్నారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గంలోని పంచాయతీల్లో ఎక్కడా అభివృద్ధి జరగలేదన్నారు. పంచాయతీలకు రూపా యి నిధులు రాలేదు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలులో కాంగ్రెస్ విఫలమైందన్నారు. మహిళలు, రైతులు, యువతను మో సం చేసిన కాంగ్రెస్‌కు పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు బుద్ధి చెప్పాలన్నారు.
రైతులను నిండా ముంచిన కాంగ్రెస్
కేసీఆర్ రైతు సంక్షేమానికి పెద్దపీట వేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచిందన్నారు. దేవరకొండ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు డిండి ఎత్తుపోతల పథకం, నక్కలగండి సొరంగ మార్గం పనుల ప్రారంభించి దాదాపు 60 శాతం పనులు పూర్తి చేస్తే, కాంగ్రెస్ సర్కార్ రెండేండ్ల కాలంలో కాలయాపన చేసిందే తప్ప చేసిందేమీలేదన్నారు. నక్కలగండి సొరం గ మార్గం పనుల్లో భాగంగా మృతి చెందిన ఎనిమిది మంది కార్మికుల మృతదేహాలను సైతం బయటకి తీయలేదని ఆరోపించారు.
బీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించాలి
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనల మేరకు పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు ఇస్తున్న సర్పంచ్, వార్డు సభ్యులకు గెలిపించాలని నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ కోరారు. పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లో, తండాల్లో చేసిన అభివృద్ధి పనులను చూసి బీఆర్ఎస్ మద్దతుదారులను ఆశీర్వదించాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.