బుద్ధవనంలో వియత్నాం బౌద్ధ భిక్షువులు
నందికొండ హిల్కాలనీలో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన బుద్ధవనాన్ని వియత్నాం దేశానికి చెందిన హునిం బౌద్ధ ప్రధాన బౌద్ధాచార్యుడు తిచ్మిన్ థాంగ్ ఆధ్వర్యంలో 130మంది బౌద్ధ భిక్షువులు బుధవారం సందర్శించారు. బుద్ధవనంలో బుద్ధుడి పాదాలకు పుష్పాంజలి ఘటించి ప్రార్థనలు చేశా రు. అనంతరం బుద్ధవనం, జాతకపార్కు, అవకాన బుద్ధ, మహాస్థూపం, ధ్యానమందిరం
నందికొండ, డిసెంబర్ 21 : నందికొండ హిల్కాలనీలో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన బుద్ధవనాన్ని వియత్నాం దేశానికి చెందిన హునిం బౌద్ధ ప్రధాన బౌద్ధాచార్యుడు తిచ్మిన్ థాంగ్ ఆధ్వర్యంలో 130మంది బౌద్ధ భిక్షువులు బుధవారం సందర్శించారు. బుద్ధవనంలో బుద్ధుడి పాదాలకు పుష్పాంజలి ఘటించి ప్రార్థనలు చేశా రు. అనంతరం బుద్ధవనం, జాతకపార్కు, అవకాన బుద్ధ, మహాస్థూపం, ధ్యానమందిరం సందర్శించారు. ఈ సందర్భంగా తిచ్మిన్ థాంగ్ మా ట్లాడుతూ బుద్ధవనం అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందుతుందని, ఆచార్య నాగార్జునుడు నడియాడిన నేలపైన నిర్మించిన ఈ బుద్ధవనం తెలంగాణ రాష్ర్టానికి మణిహారంగా నిలుస్తుందని అన్నారు.
ప్రపంచంలోని వివిధ బౌద్ధ నమూనాల శిల్పాలను ఒకే చోట చూడడం చాల సంతోషంగా ఉందని తెలిపారు. బౌద్ధ వారసత్వ పర్యాటక కేంద్రంగా బుద్ధవనాన్ని తీర్చిదిద్ధిన బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్యను యన అభినందించారు. పురావస్తు నిపుణులు, బౌద్ధ పరిశోధకులు ఈమని శివనాగిరెడ్డి బుద్ధవనం విశేషాలను వివరించాడు. అంనంతరం బౌద్ధభిక్షువులు నాగార్జునకొండను సందర్శించారు. వారితో బుద్ధవనం ఓఎస్డి సుధాన్రెడ్డి, ఎస్ఈ క్రాంతిబాబు, సహాయకశిల్పి శ్యామ్ బుద్ధవనం సిబ్బంది నర్సింహ ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

