గుర్రంపోడ్, ఆగస్టు 21 : విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి హెచ్చరించారు. మండలంలోని కొప్పోలు గ్రామంలో గల వివిధ ప్రభుత్వ సంస్థలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్వచ్ఛదనం.. పచ్చదనం కింద చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాలను గ్రామమంతా తిరిగి పరిశీలించారు.
అకడకడ మురికి కాల్వల్లో పిచ్చి మొకలు ఉండడాన్ని గమనించి వాటిని తీసివేయాలని, మురికి కాల్వలు శుభ్రంగా ఉంచాలని ఎంపీడీఓ మంజులను ఆదేశించారు. ఇదే విషయంపై జిల్లా పంచాయతీ అధికారి మురళితో ఫోన్లో మాట్లాడి అన్ని గ్రామాల్లో చెత్తాచెదారం ఉండకుండా చూసుకోవాలని సూచించారు. అనంతరం పశు వైద్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసి సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్‌ను, మందుల స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు.
పశు వైద్య ఉప కేంద్రం దగ్గరికి వచ్చిన రైతులతో రుణమాఫీపై మాట్లాడి రుణమాఫీ అయ్యింది, లేనిది అడిగి తెలుసుకున్నారు. పశు వైద్య ఉపకేంద్రం లైవ్ స్టాక్ అసిస్టెంట్ మట్టయ్య విధులకు సరిగా రావడం లేదని, అంతేకాక పశువులకు చికిత్స సైతం సరిగా అందించడం లేదని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా తక్షణమే ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేయాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారిని ఆదేశించారు.
అంగన్వాడీ, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. గ్రామంలో పర్టిలైజర్ యజమానులు అధిక ధరలకు ఎరువులు అమ్ముతున్నారని కలెక్టర్ దష్టికి తీసుకురాగా మండల వ్యవసాయాధికారి కంచర్ల మాధవరెడ్డిని విచారణ చేసి యాక్షన్ తీసుకోవాలని తెలిపారు. విచారణ తరువాత వారి లైసెన్స్‌లను రద్దు చేస్తున్నట్లు వ్యవసాయాధికారి తెలిపారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ మంజుల, వ్యవసాయాధికారి కంచర్ల మాధవరెడ్డి తదితరులు ఉన్నారు.
శాండ్ ట్యాక్స్‌లో మాత్రమే ఇసుక బుక్ చేసుకోవాలి
నీలగిరి : గృహ నిర్మాణంతోపాటు ఇతర అవసరాల కోసం ఇసుక అవసరం ఉన్న వారు కచ్చితంగా శాండ్ ట్యాక్స్‌లో మాత్రమే బుక్ చేసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. నల్లగొండ నుంచి గుర్రంపోడ్‌కు వెళ్తున్న క్రమంలో బుధవారం పట్టణ శివారులో నల్లగొండకు వస్తున్న ఇసుక ట్రాక్టర్లను నిలిని వాటి అనుమతులు, లైసెన్స్ ఇతర వివరాలను తెలుసుకున్నారు. రసీదులు, ఆన్లైన్ బుకింగ్ తనిఖీ చేశారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.