హైదరాబాద్, ఫిబ్రవరి19(నమస్తే తెలంగాణ) : ఎఫ్టీఈఏ (ఫుల్ బ్రైట్ టీచింగ్ ఎక్స్‌లెన్స్ అండ్ అచీవ్మెంట్) ప్రోగ్రామ్‌కు ఉపాధ్యాయులు మార్చి 6లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు గురువారం సూచించారు. ఎంపికైన టీచర్లు ఆరువారాలపాటు అమెరికాలోని యూఎస్ యూనివర్సిటీ పరిధిలోని స్కూళ్లలో బోధనాభ్యాసన ప్రక్రియలు పర్యవేక్షిస్తారు.
6 నుంచి 12వ తరగతి వరకు ఫుల్‌టైమ్ ఉపాధ్యాయులుగా పనిచేసిన వారు, ఇంగ్లిష్, ఇంగ్లిష్ ఫారన్ లాంగ్వేజ్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, సైన్స్, స్పెషల్ ఎడ్యుకేషన్‌లో కనీసం ఐదేండ్లపాటు అనుభవం ఉన్నవారు దరఖాస్తుకు అర్హులని వెల్లడించారు. ఏప్రిల్ మొదటి వారంలో స్క్రీనింగ్ చేస్తారు. అదేనెల చివరి వారంలో టోఫెల్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. సెప్టెంబర్‌లో తుది జాబితా ప్రకటిస్తారు. మొదటి విడతలో ఎంపికైన వారిని 2027 జనవరి నుంచి మార్చి వరకు, రెండో విడత టీచర్లను 2027 సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు అమెరికాలోని యూనివర్సిటీకి పంపిస్తారు.