పెన్పహాడ్, నవంబర్ 10 : పెన్పహాడ్ మండలంలోని అనంతారం గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం శ్రీ శ్రీ త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వైభవంగా కొనసాగాయి. ఆలయ అర్చకుల వేద మంత్రములతో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన, ప్రత్యేక యాగశాలలో హోమంతో కూడిన నిత్యారాదరణ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులకు అన్నదాన వితరణ చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు ప్రజలు పలు గ్రామాల నుండి భారీ ఎత్తున తరలివచ్చారు.
స్వామివారి ఆలయానికి ట్రస్ట్ ద్వారా రూ.1.20 కోట్ల విరాళాలు సేకరించి ఆలయ నిర్మాణం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ కమిటీ ట్రస్ట్ చైర్మన్ సామ బుచ్చిరెడ్డి, ట్రస్ట్ సభ్యులు బచ్చుపల్లి నాగేశ్వరరావు, పోనుగోటి ఉపేందర్ రావు, మల్గిరెడ్డి ఇంద్రసేనారెడ్డి, రిందా కుమార్ రెడ్డి, విజయ లక్ష్మి, భాను, బైరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దంతాల వెంకటేశ్వర్లు, చిట్టెపు నారాయణరెడ్డి, ఆహ్వాన కమిటీ సామ సురేందర్ రెడ్డి, మల్గిరెడ్డి సంజీవరెడ్డి, మామిడి పరంధాములు, చెవిగోని రాములు జినులా నాగార్జున, వినోద్, మహేశ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.