తుంగతుర్తి, ఏప్రిల్ 20 : తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, సినిమా పాటలు, జానపద గీతాలు, తెలంగాణ పాటలు, దేశభక్తి గీతాలకు నృత్యాలు చేసి అలరించారు. సోషల్ మీడియా మాయ, చినిగిన దుప్పటివంటి నాటికలను ప్రదర్శించి సమాజానికి ఉపయోగకరమైన సందేశాలతో ఆలోచింపజేశారు. పాఠశాల ఉపాధ్యాయుడు మల్లెపాక రవీందర్ అందెశ్రీ రచించిన “చూడ సక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి” పాటకు చేసిన నృత్యంతో ఆకట్టుకున్నారు. ఈ ప్రదర్శనలో వివిధ కులవృత్తులను ప్రతిబింబిస్తూ విద్యార్థులు పాత్రధారణ చేసి సమానత్వం, సమాజ ఐక్యతను చాటి చెప్పారు.

ఘనంగా వెంపటి ఎంపీపీఎస్ వార్షికోత్సవ వేడుకలు
మరో ఉపాధ్యాయుడు గుండ్ల ఆంజనేయులు ప్రదర్శించిన చదువు గొప్పతనాన్ని తెలియజేసే నృత్యం ప్రేక్షకుల హృదయాలను హత్తుకోవడం జరిగింది. కార్యక్రమం అనంతరం వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి అతిథుల చేత మెమెంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు చిత్తలూరువెంకట్రామనరసమ్మ, గ్రామ సర్పంచ్ తప్పెట్ల ఎల్లయ్య, ఉప సర్పంచ్ దాసరి మంజుల, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కోరుకొప్పుల ఉమారాణి, ఉపాధ్యాయులు మల్లెపాక రవీందర్, గట్టు మాధవి, నిమ్మర బోయిన నవీన, బండారు భవాని,జీడి అనిల్ కుమార్, మిట్టగడుపుల విక్రం, మాలోతు కృష్ణ, గుండ్ల ఆంజనేయులు, రామనబోయిన మౌనిక, అబ్బగాని మంజుల, శీలోజ్ రమాదేవి పాల్గొన్నారు.

ఘనంగా వెంపటి ఎంపీపీఎస్ వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా వెంపటి ఎంపీపీఎస్ వార్షికోత్సవ వేడుకలు