గుండాల, అక్టోబర్ 24: కర్నూలు బస్సు ప్రమాదం లో యాదాద్రి-భువనగిరి జిల్లా గుండాల మండ లం వస్తాకొండూర్ గ్రామానికి చెందిన మహేశ్వరం అనూష(23) సజీవదహనం అయింది. బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో అనూష సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. అక్టోబర్ 16న దీపావళి పండుగ సందర్భంగా స్వగ్రామానికి వచ్చింది. పండుగ అనంతరం ఉద్యోగరీత్యా గురువారం బెం గళూరురు బయలు దేరారు. అనూష హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కిం ది. శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో అనూష మం టల్లో చిక్కుకొని సజీవదహనం అయ్యారు.
దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రు లు, కుటుంబసభ్యులు గుండెలు పగిలేలా రోదించారు. అనూష తల్లిదండ్రులు మహేశ్వరం శ్రీనివాస్‌రెడ్డి, విజిత దంపతులు వ్యవసాయం చేస్తూ జీవ నం సాగిస్తున్నారు. వీరికి అనూషతోపాటు పెద్ద కుమార్తె ఉషశ్రీ ఉన్నారు. ఉషశ్రీ ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లగా… చిన్నకుమార్తె అనూష (23) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. అనూష 10వ తరగతి వరకు జనగామ జిల్లా దేవరుప్పులలోని బాలయేసు పాఠశాలలో చదువుకొని, ఇంటర్మీడియట్, బీటెక్ హైదరాబాద్‌లో పూర్తి చేశారు. అనంతరం 2024లో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరారు. అనూష గ్రామస్తులందరితో కలుపుగోలుగా ఉండేదని గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలియడంతో రోదిస్తూ అనూష తల్లిదండ్రులకు కర్నూలు ఏరియా దవాఖానకు వెళ్లారు. కర్నూలులో రెవెన్యూ, పోలీస్ అధికారులు మృతురాలి తల్లిదండ్రులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించినట్లు, అనూష మృతదేహాన్ని శనివారం అప్పగించనున్నట్లు సమాచారం.