యాదగిరిగుట్ట, ఆగస్టు 30 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం పురస్కరించుకొని సామూహిక వరలక్ష్మీ వత్రాలు ఘనంగా జరిగాయి. కొండ కింద సత్యనారాయణస్వామి వ్రత మండపంలో లక్ష్మీ అమ్మవారిని దివ్య మనోహరంగా అలంకరించి వేడుకను జరిపారు. సుమారు 200 మంది మహిళలు వ్రతంలో పాల్గొన్నారు.
ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి దంపతులు, ఈఓ భాస్కర్రావు, డీఈఓ దోర్బల భాస్కర్శర్మ, శివాలయ ప్రధానార్చకుడు గౌరీభట్ల నరసింహరాములు శర్మ, ఏఈఓ నవీన్, ఆలయ సిబ్బంది ఆశ్విని పాల్గొన్నారు.