పల్లె ప్రగతిలో రూపుదిద్దుకున్న ప్రకృతి అందాలు
గోదారి గోదారీ.. పారేటి గోదారీ.. చుట్టూ నీళ్లున్నా చుక్క నీరు దొరుకని ఏడారి ఈ భూమియని. తలాపున పారుతుంది గోదారి.. మన చేను, మన చెలక ఎడారి.’ అనే పాటలు నాటి తెలంగాణ ఉద్యమంలో మార్మోగాయి. ఇది అక్షరాల నిజం. అరవై ఏండ్ల సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతానికి సాగు జలాలు అందించాలని గత పాలకులు గట్టి ప్రయత్నమేదీ చేయకపోవడంతో నిత్యం కరువుతో అల్లాడుతూ రైతులు వలసలు, ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కోకొల్లలు.
- ఆధ్యాత్మిక చిహ్నాలతో వైకుంఠధామం
- కొనసాగుతున్న కాల్వ తవ్వకం పనులు
- 15వ ప్యాకేజీ బ్రాంచ్ కెనాల్ ద్వారా సరఫరా
- 11 చెరువులు, 32 కుంటలు నింపేలా ఏర్పాటు
- సాగులోకి రానున్న 35,131 ఎకరాలు
- భూ నిర్వాసితులకు రూ.12.46 కోట్ల పరిహారం అందజేత
- సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు
ఓ పక్క కృష్ణానది, మరో పక్క అన్నవేరు వాగు.. ఎటు చూసినా రాతిగుట్టలు బల్లపర్చుకొని ఉన్న తీరు.. అక్కడ ఎలాంటి నిర్మాణాలకూ అనుకూలంగా లేనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కృషితో సుందరమైన ప్రకృతి వనాలు రూపుదిద్దుకున్నాయి. పౌరాణిక, ఆధ్యాత్మిక చిహ్నాలతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో వైకుంఠధామం, డంపింగ్యార్డు, అందమైన చెరువు కట్ట, క్రీడాప్రాంగణం, నర్సరీ, కంపోస్ట్ షెడ్లు ఏర్పాటయ్యాయి. చుట్టూరా అభివృద్ధి పనులతో మండలంలోని తాళ్ల వీరప్పగూడెం అలరారుతున్నది.
రాజాపేట, జూలై 16 : గోదారి గోదారీ.. పారేటి గోదారీ.. చుట్టూ నీళ్లున్నా చుక్క నీరు దొరుకని ఏడారి ఈ భూమియని. తలాపున పారుతుంది గోదారి.. మన చేను, మన చెలక ఎడారి.’ అనే పాటలు నాటి తెలంగాణ ఉద్యమంలో మార్మోగాయి. ఇది అక్షరాల నిజం. అరవై ఏండ్ల సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతానికి సాగు జలాలు అందించాలని గత పాలకులు గట్టి ప్రయత్నమేదీ చేయకపోవడంతో నిత్యం కరువుతో అల్లాడుతూ రైతులు వలసలు, ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కోకొల్లలు. తెలంగాణ ప్రాంతానికి గోదావరి జలాలు అందించి సస్యశ్యామలం చేసి రైతుల కండ్లల్లో సంతోషం నింపాలని గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. ఆ ప్రాజెక్ట్లోని 15వ ప్యాకేజీ బ్రాంచ్ కేనాల్ ద్వారా రాజాపేట మండలానికి సాగు జలాలు రానున్నాయి. కాల్వ పనులు పూర్తయితే కాళేశ్వరం జలాలతో కరువు నేల తడవనుంది. ఆరు దశాబ్దాల కల సాకారం కానుండడంతో మండల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అందమైన సుందర వనాలు..
తాళ్లవీరప్పగూడెం గ్రామంలో ఎటుచూసినా బల్లపర్చుకొని ఉన్న రాతి నేలలే. అయినప్పటికీ గ్రామ సర్పంచ్ బాల సుజాత, అధికారులు, నాయకులు, గ్రామస్తుల సహకారంతో రాతి నేలలను తొలగించి సుందర కట్టడాలను నిర్మించారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను సద్వినియోగం చేసుకొని పలు అభివృద్ధి పనులు చేపట్టారు. మూడెకరాల స్థలంలో రాళ్లను తొలగించి పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. అందులో 350 ట్రిప్పుల నల్ల మట్టిని పోసి 4వేల మొక్కలు నాటారు. అక్కడ తీసిన పెద్ద బల్లపరుపు రాళ్లను వృథాగా పడేయకుండా వాటిపై సీఎం కేసీఆర్ చిత్రపటంతోపాటు ప్రకృతి అందాలను తీర్చిదిద్దారు. ప్రకృతి వనంలో మంచి స్విమ్మింగ్ ఫూల్ కూడా ఏర్పాటు చేశారు.
ఆధ్యాత్మిక, పౌరాణిక విగ్రహాలతో వైకుంఠధామం
గ్రామ శివారులోని ఊర చెరువు పక్కన ఐదెకరాల భూమిలో వైకుంఠధామాన్ని ఏర్పాటు చేశారు. చివరి మజిలీలో బాధలను మర్చిపోయే విధంగా ఆహ్లాద వాతావరణం పెంచేలా పూల మెక్కలు, చెట్లను పెంచి పార్కులా తీర్చిదిద్దారు. సత్యహరిశ్చంద్ర, శివుడి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఊర చెరువులో మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా పూడిక తీసి చెరువు కట్టను పటిష్టం చేశారు. చెరువు పక్కనే వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్, డంపింగ్ యార్డులను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులతో గ్రామం సుందరంగా తీర్చిదిద్దుకున్నది.
మూడెకరాల్లో క్రీడా ప్రాంగణం
గ్రామం పక్కనే మూడెకరాల భూమిలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. యువకులు, విద్యార్థులు ఆడుకునే విధంగా రాళ్ల నేలను మట్టితో పూడ్చి వాలీబాల్, ఖోఖో, క్రికెట్, కబడ్డీ కోర్టులను తయారు చేశారు. క్రీడా మైదానానికి వెళ్లేందుకు రోడ్డు సైతం వేశారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

