గట్టుప్పల్, డిసెంబర్ 31 : భూమిలో పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకోవటానికి మట్టి నమూనా టెస్ట్ అవసరమని గట్టుప్పల్ మండల వ్యవసాయ అధికారి మైల రేవతి అన్నారు. మండలం కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద నేల ఆరోగ్యం, సారవంతం అనే అంశంపై బుధవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేల ఆరోగ్య ప్రాముఖ్యతను వివరించారు. పంటకి ఎంత మోతాదులో పోషకాలు అవసరం అవుతాయో, నేలలో ఏ పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో, పంటకి ఎంత అవసరం మేరకు వాడాలో తెలుసుకోవడానికి మట్టి నమూనా టెస్టింగ్ విధానం ఉపయోగపడుతుందన్నారు. దాని కోసం మట్టి నమూనా సేకరించడం, టెస్టింగ్ గురించి సాయిల్ హెల్త్ కార్డ్ మొబైల్ యాప్ను ఉపయోగించడంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ కార్తీక్, పాఠశాల, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.