చింతపల్లి, సెప్టెంబర్ 23 : చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కంకణాల వెంకట్ రెడ్డి తల్లి కంకణాల దశరథమ్మ ప్రథమ వర్థంతి సందర్భంగా ఆమె విగ్రహాన్ని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నల్లగొండ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్, చింతపల్లి మాజీ జడ్పీటీసీ కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ మల్లిఖార్జున్ రెడ్డి, కేతావత్ బిల్యా నాయక్, వడ్త్య రమేశ్‌నాయక్, టీవీఎన్ రెడ్డి, పల్లా ప్రవీణ్ రెడ్డి, వెలుగురి వల్లపు రెడ్డి, దొంతం చంద్రశేఖర్ రెడ్డి, చింతపల్లి సుభాష్, పులిరాజ్ గౌడ్, వెంకటయ్య, ఆంజనేయులు, నిరంజన్, శిమర్ల శ్రీను పాల్గొన్నారు.
Chintapally : గొల్లపల్లిలో కంకణాల దశరథమ్మ విగ్రహావిష్కరణ