మునుగోడు జనవరి 21 : తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం 2026 నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని మునుగోడు సబ్ డివిజన్ కార్యాలయంలో ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం 327 జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి సమ్మిరెడ్డి, మునుగోడు ఏడీఈ అశోక్ కుమార్, ఏఈ నరేందర్ రెడ్డి, 327 యూనియన్ సెక్షన్ లీడర్ పెరుమాండ్ల నరసింహ, యూనియన్ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏడీఈ అశోక్ కుమార్, ఏఈ నరేందర్ రెడ్డిలకు డైరీ అందజేశారు. విద్యుత్ ఉద్యోగుల సంఘం 327 యూనియన్ ప్రతి కార్మికునికి అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమములో నల్లగొండ డివిజన్ జనరల్ సెక్రటరీ పాండు, స్వామి రెడ్డి, అనిల్, భిక్షం, ముత్యం, నాగయ్య, రాజబాబు, సాయిరాం, జోష్న, రాంప్రసాద్ రెడ్డి, సంఘం నాయకులు పాల్గొన్నారు.