కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌ను అరెస్టు చేయాలి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నకిరేకల్‌లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో బండి సంజయ్, ఆయన కుమారుడు భగీరథ్ ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నాయకులు మాట్లాడుతూ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని, బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
నకిరేకల్, మే 10 : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నకిరేకల్‌లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో బండి సంజయ్, ఆయన కుమారుడు భగీరథ్ ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నాయకులు మాట్లాడుతూ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని, బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన తన కుమారుడిని రక్షించేందుకు బండి సంజయ్ ప్రయత్నిస్తున్నాడని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కుమ్మక్కై కేసును నీరుగార్చే యత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగేంతవరకూ బీఆర్ఎస్వీ పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో మహాత్మాగాంధీ యూనివర్శిటీ ఇన్‌ఛార్జి గాదె శివ, బీఆర్ఎస్ జిల్లా నాయకులు చింతమళ్ల వెంకటేశ్, కందికంటి నాగేంద్రబాబు, బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు జిల్లా సంపత్ కుమార్, నియోజకవర్గ నాయకులు జిల్లా సందీప్, మండల నాయకులు యాతాకుల ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం
తుంగతుర్తి, మే 10 : బాలికపై అత్యాచారం చేసిన కేంద్ర మంత్రి కొడుకు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం తుంగతుర్తిలో కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య మాట్లాడుతూ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు చేసినా, ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేయలేదన్నారు. ముఖ్యమంత్రితో బండి సంజయ్‌కి ఉన్న సంబంధంవల్లనే ఈ కేసును నీరు గార్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి, నేరస్తుణ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల నాయకులు గడ్డం సోమేష్, గోపగాని రమేష్, లక్ష్మయ్య, నాగమల్లు, వెంకటేష్, లతీఫ్, గోపగాని వెంకన్న, చింతకుంట్ల సురేష్, కొల్లూరి మహేందర్, ఆకారపు భాస్కర్ పాల్గొన్నారు.
నాగారంలో దిష్టిబొమ్మ దహనం..
నాగారం, మే 10 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కల్లెట్లపల్లి ఉప్పలయ్య అన్నారు. నాగారంలో ఆదివారం కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు దహనం చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌పై నమోదైన కేసు విషయంలో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మరోసారి కేటీఆర్‌పై అవాకులు చెవాకులు మాట్లాడితే బీఆర్ఎస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని అన్నారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు జరుగుతున్నాయని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడంలేదన్నారు. ఇప్పటికైనా స్పందించి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గుండగాని అంబయ్య, మండల నాయకులు పొదిల రమేష్‌గౌడ్, చిల్లర చంద్రమౌళి, కూరం వెంకన్న, ఈదుల కిరణ్‌కుమార్, సంపెట అశోక్, ఈరేటి అంజి, బొయిని లింగమల్లు, గ్రామశాఖ అధ్యక్షులు కన్నెబోయిన మల్లేష్, బండగొర్ల యల్లయ్య, తెల్సూరి నర్సయ్య, తీగుళ్ల యాదగిరి, పాముకుంట్ల యల్లయ్య, కంబాల మల్లేష్, ఈరేటి స్వామి, బుర్రి సురేష్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

