పెన్పహాడ్, సెప్టెంబర్ 29 : పెన్పహాడ్ మండలంలోని రెండు వేర్వేరు గ్రామాల్లో మంగళవారం చోటుచేసుకున్న విద్యుదాఘాతంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చిదేళ్ల గ్రామానికి చెందిన సురభి సైదులు గౌడ్ (45) తన ఇంటి వద్ద ఉన్న ఇనుప దండెంకు చేపలు ఎండ పెడుతుండగా ఇనుప వైర్ కు విద్యుత్ సరఫరా కావడంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక ఘటనలో అనాజీపురం గ్రామానికి చెందిన దుబాని లక్ష్మయ్య (35) తన సొంత వ్యవసాయ పొలంలో గడ్డి కొస్తుండగా విద్యుత్ మోటార్ వైరు బయటకి తేలి విద్యుత్ సరఫరా కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
Penpahad : చేపలు ఎండబెడుతుండగా ఒకరు, గడ్డి కోస్తుండగా మరొకరు విద్యుత్ షాక్కు గురై మృతి