అడవిదేవులపల్లి, జూన్ 12 : రోడ్డు ప్రమాదంలో ఇరువురు వ్యక్తులు మృతి చెందిన సంఘటన అడవిదేవులపల్లి మండల పరిధిలోని ముదిమాణిక్యం వెళ్లే రహదారిపై శుక్రవారం జరిగింది. ఎస్ఐ శేఖర్ వివరాలు వెల్లడించారు. ముదిమణిక్యం గ్రామానికి చెందిన పగిళ్ల సైదులు అడవిదేవులపల్లికి వస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఈడుదుల రాంబాబు అడవిదేవులపల్లి నుండి ముదిమాణిక్యం వెళ్తున్నాడు. రాంబాబు తన బైక్ పై బొమ్మకంటి నరసయ్యను ఎక్కించుకుని వెళ్తుండగా మార్గమధ్యంలో ఇరువురి బైకులు ఢీకొన్నాయి. దీంతో పగిళ్ల సైదులు (54), బొమ్మకంటి నరసయ్య (45) అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. రాంబాబుకు తీవ్ర గాయాలు కాగా 108 వాహనం ద్వారా ఏరియా హాస్పిటల్ కి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్కు తరలించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.