– 28 వరకు సర్టిఫికెట్ పరిశీలనకై స్లాట్ బుకింగ్
– 26 నుంచి 29వరకు సర్టిఫికెట్స్ పరిశీలన – వెబ్ ఆప్షన్స్
– నల్లగొండ ఉమ్మడి జిల్లాలో రెండు కౌన్సిలింగ్ కేంద్రాల ఏర్పాటు
రామగిరి, జూన్ 24 : పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ పాలీసెట్-2025 కౌన్సిలింగ్ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. కాగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రెండు ఫ్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో కౌన్సిలింగ్ కేంద్రాలను రాష్ట్ర సాంకేతిక విద్యశాఖ ఏర్పాటు చేసింది. పాలీసెట్‌లో ఎంపీసీ స్ట్రీమ్‌లో ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఆయా కేంద్రాల్లో (హెల్ఫ్‌లైన్ సెంటర్స్) సూచించిన తేదీల్లో హాజరై సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్.నరసింహారావు తెలిపారు. వెల్లడించారు. కౌన్సిలింగ్ ప్రక్రియకు హాజరయ్యే విద్యార్థులు విధిగా అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్, జిరాక్స్, కులం, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు తీసుకు రావాలని సూచించారు.
కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇలా
– ఈ నెల 24 నుంచి 28 వరకు సర్టిఫికెట్ పరిశీలనకై స్లాట్ బుకింగ్
– 26 నుంచి 29 వరకు స్లాట్ బుకింగ్ చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్ పరిశీలన
– 26 నుంచి జూలై 1 వరకు సర్టిఫికెట్ పరిశీలన చేసిన విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునే అవకాశం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కౌన్సిలింగ్ సెంటర్స్ ఇవే
– ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల – నల్లగొండ
– ఫ్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల బాలికలు – సూర్యాపేట