– అధ్యక్షుడిగా రవీందర్ రెడ్డి, కార్యదర్శిగా శ్యాంసుందర్‌రెడ్డి
రాచుగరి, జనవరి 23 : తెలంగాణ రికగ్నజ్డ్ స్కూల్స్ మెనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) నల్లగొండ జిల్లా కమిటీ సర్వసభ్య సమావేశం, జిల్లా నూతన కమిటీ ఎన్నిక శుక్రవారం జిల్లా కేంద్రంలోని చిన్నవెంకట్ రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా గాదె రవీందర్ రెడ్డి (మిర్యాలగూడ), ప్రధాన కార్యదర్శిగా అలుగుబెల్లి శ్యాంసుందర్‌రెడ్డి (నల్లగొండ), కోశాదికారిగా జూలూరి శ్రీనయ్య (దేవరకొండ) ను ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీని నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు సాదుల మధుసూదన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు కొలనుపాక రవికుమార్ హాజరై అభినందనలు తెలిపి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు ముక్కముల రాంమోహన్, విబిధ పాఠశాలల కరస్పాండెంట్స్ పాల్గొన్నారు.