చౌటుప్పల్, అక్టోబర్ 22: మోసాల రాజగోపాల్‌రెడ్డి మునుగోడులో మునగడం ఖాయమని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. నమ్మి ఓటేసిన నియోజకవర్గ ప్రజలను తన కాంట్రాక్టుల కోసం మోసం చేసిన ఆయనకు తగిన బుద్ధి చెప్పేందుకు ఇక్కడి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ మున్సిపాలిటీలోని నాలుగో వార్డులో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో కలిసి కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. స్వార్థ ప్రయోజనాల కోసమే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారని ఆరోపించారు.
మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్‌రెడ్డికి భంగపాటు తప్పదని అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాశ్‌రెడ్డితో కలిసి హోంశాఖ మంత్రి మహమూద్ అలీ లక్కారంలోని 7,8 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చుక్క ఆండాలు ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ప్రేమగా ఆమెకు కూడా భోజనం తినిపించారు. కౌన్సిలర్ ఎండీ బాబా షరీఫ్, టీఆర్ఎస్ నాయకులు పొయ్యడ శేఖర్‌గౌడ్, వీరమల్ల దాసు, అస్లాం ఖాన్, కేతరాజు శేఖర్, నాయకులు సుధాకర్, మహేందర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, ముత్యంరెడ్డి, నర్సింగరావు, చారి, సంతోష్‌రెడ్డి, గిల్బర్ట్, కుమారస్వామి, అంజి, రాజు, సుధాకర్, కుమారస్వామి, బద్రుద్దీన్ పాల్గొన్నారు.
సంస్థాన్ నారాయణపురం : మైనార్టీల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలో నిర్వహించిన మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మండలాధ్యక్షుడు లక్ష్మయ్య, ఎంపీపీ ఉమాదేవి, సర్పంచ్ శ్రీహరి, పీఏసీఎస్ చైర్మన్ జంగారెడ్డి, గౌసుద్దీన్ ఖురేషి, హాషం, ఫయాజ్, నయీం, షరీఫ్ పాల్గొన్నారు.
మునుగోడు : మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మైనార్టీ నాయకులు సమావేశానికి హోం మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనార్టీలకు తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అందిస్తుందని తెలిపారు. ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్రనాయకుడు నారబోయన రవిముదిరాజ్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, షబ్బీర్ అలీ, మహ్మద్ రఫీక్, వాజీద్, బషీర్, షబ్బీర్, ఖాలేద్ పాల్గొన్నారు.