నల్లగొండ రూరల్, జనవరి 22 : తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) నూతన సంవత్సర క్యాలెండర్ (2026) ను నల్లగొండ మండల విద్యాధికారి కత్తుల అరుంధతి గురువారం నల్లగొండలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమ పరిధిలో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. అలాగే నూతనంగా ఎన్నికైన తపస్ నల్లగొండ మండల రూరల్ శాఖ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తపస్ నల్లగొండ మండల రూరల్ అధ్యక్షుడు అన్నెబోయిన శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి నిమ్మనగోటి రామకృష్ణ, తపస్ రాష్ట్ర వెబ్ సైట్, డిజిటల్ విభాగం కో కన్వీనర్ కంచనపల్లి విజయ్ కుమార్, తపస్ సీనియర్ కార్యకర్తలు వీరమళ్ల మల్లికార్జున్, దగ్గు రవి పాల్గొన్నారు.