మునుగోడు, జులై 03 : రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ను అమలు చేసి ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఇవ్వాలని డీవైఎఫ్ఐ నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి అన్నారు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి రూ.4 వేలు ఇవ్వాలని, యూత్ డిక్లరేషన్ హామీలను అన్నిటినీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 4న చలో సెక్రటరియేట్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గురువారం మునుగోడు మండల కేంద్రంలో మండల కమిటీ సమావేశం నిర్వహించి మాట్లాడారు. రేపటి సెక్రటేరియట్ ముట్టడిని నిరుద్యోగ యువత జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి మిర్యాల భరత్, మండల అధ్యక్ష, కార్యదర్శులు బొడ్డుపల్లి నరేశ్, యాసరాని వంశీకృష్ణ, మండల ఉపాధ్యక్షులు యాట శ్రీకాంత్, యాదయ్య పాల్గొన్నారు.