దేవరకొండ, డిసెంబర్ 23 : విద్యార్థుల్లో నైపుణ్యాన్ని ఉపాధ్యాయులు వెలికితీయాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని బచ్పన్ పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగాసు జాన్‌యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్‌నాయక్ పాల్గొన్నారు.
రుద్రమాదేవి సేవలు మరువలేనివి
నల్లగొండ రూరల్ : నల్లగొండ మాజీ ఎమ్మెల్యే గడ్డం రుద్రమాదేవి సేవలు మరువలేనివని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ అడిటోరియంలో నిర్వహించిన రుద్రమాదేవి దశదిన కర్మలో జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, భాస్కర్‌రావు, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, రవీంద్రకుమార్‌తో కలిసి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి, శంకర్‌నాయక్, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పిల్లి రామరాజు, పాశం నరేశ్‌రెడ్డి, బొర్ర సుధాకర్ పాల్గొన్నారు.