కట్టంగూర్, ఆగస్టు 14 : 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురష్కరించుకుని కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామంలో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర నిర్వహించారు. బీజేపీ నాయకులు, పాఠశాల విద్యార్థులు జాతీయ జెండా చేబూని గ్రామంలోని జాతీయ రహదారి వెంట తిరంగా యాత్ర చేపట్టారు. దేశ ప్రజలందరిని ఏకం చేయడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన విధంగా తిరంగా యాత్ర నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ మండలాధ్యక్షుడు నీలం నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోలి ప్రభాకర్, పబ్బు వెంకటేశ్వర్లు, జూలూరు నాగరాజు, పబ్బు వినయ్, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.