మిర్యాలగూడ, ఏప్రిల్ 21 : మిర్యాలగూడ డీఎస్పీగా తుమ్మ ఆనంద్ రెడ్డి నియమితులయ్యారు. వికారాబాద్ ఇంటలిజెన్స్ విభాగంలో డీఎస్పీగా పని చేస్తున్న ఆయనను మిర్యాలగూడ డీఎస్పీగా నియమిస్తూ డీఐజీ బి.శ్రీధర్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ రాజును సీఐడీ విభాగానికి బదిలీ చేశారు. కాగా ఆనంద రెడ్డి గతంలో దేవరకొండ డీఎస్పీగా, హాలియా, మిర్యాలగూడ సర్కిల్ సీఐగా, హాలియా ఎస్ఐగా పనిచేసిన ఆయన నిబద్ధత కలిగిన అధికారిగా మంచి గుర్తింపు పొందారు.