శాలిగౌరారం, జూన్ 05 : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని పెర్కకొండారం గ్రామ శివారులో గల నేషనల్ హైవేపై గురువారం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి శాలిగౌరారం మండలం మీదుగా అర్వపెల్లి వైపు వెళ్తున్న కారు.. అదే వైపు వెళ్తున్న బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు కిందపడడంతో తీవ్రంగా గాయపడ్డారు. క్షత్రగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.