పెద్దవూర, జూన్ 19 : మండల పరిధిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అకడికకడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఐ గోపాల్‌రావు కథనం ప్రకారం..పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం కొంకవారిపాలేనికి చెందిన కాకర్ల తోమాసయ్య(59), అతడి చిన్న కుమారుడు కాకర్ల ప్రకాశ్‌రావు(35) కలిసి హైదరాబాద్ నుంచి గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో హయత్‌నగర్‌కు చెందిన ఎరకల ప్రవీణ్‌కు చెందిన కారును కిరాయికి మాట్లాడుకొని నాగార్జునసాగర్‌లోని సాగర్మాత గుడికి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు పెద్దవూర మీదుగా సాగర్ వైపు వెళ్తూ రాత్రి 10 గం టల సమయంలో రామన్నగూడెం తండా శివారులోకి చేరుకుంది. ఆ సమయంలో సాగర్ నుంచి పెద్దవూర వైపు వస్తున్న మారుతి ఎక్స్ఎల్ 6 కారు డ్రైవర్ గొర్రె రామకృష్ణ కారును అతివేగంగా, నిర్లక్ష్యంగా రాంగ్ రూట్లో నడుపుతూ తోమాసయ్య ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో తోమాసయ్య, అత డి కుమారుడు ప్రకాశ్‌రావు అకడికకడే మృతి చెందారు. వీరితోపాటు ఎక్స్ఎల్ 6 కారులో ప్రయాణిస్తున్న హనుమకొండ జిల్లా అచ్చంపేటకు చెందిన రావుల సాయికుమార్(35) కూడా తీవ్ర గాయాలై అకడికకడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదంలో హైదరాబాద్ కారు డ్రైవర్ ప్రవీణ్‌తోపాటు ఎక్స్ఎల్ 6 కారులోని మరో ప్రయాణికుడు కొర్ర సాయికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను, గాయపడిన బాధితులను సాగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. శుక్రవారం మృతుడు తోమాసయ్య పెద్ద కుమారుడు అంతయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ పవార్ పరిశీలించారు.