సూర్యాపేట, ఏప్రిల్ 02 : సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అవకతవకలకు పాల్పడిన ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ జిల్లా సహకార అధికారి పద్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక సహకార సంఘంలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టగా ప్రాథమిక నివేదికను అనుసరించి బాధ్యులైన ఆర్.నాగేందర్, స్టాఫ్ అసిస్టెంట్ పి.కోటయ్య, కంప్యూటర్ ఆపరేటర్ పర్వీన్‌ను సస్పెండ్ చేశారు. సెక్షన్ 51 కింద విచారణకు ఆదేశించగా పూర్తి విచారణలో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు.