బొడ్రాయిబజార్, ఏప్రిల్ 5 : ఈ నెల 7, 8, 9 తేదీల్లో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కు సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి రాహుల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7న ఆదివారం వారంతపు సెలవు, 8న సోమవారం అమావాస్య, 9న మంగళవారం ఉగాది పండుగ సందర్భంగా సెలవు ప్రకటించినట్లు వెల్లడించారు.
రైతులు, వ్యాపారులు విషయాన్ని గమనించి సెలవు దినాల్లో మార్కెట్కు సరుకులు తీసుకొచ్చి ఇబ్బందులు పడవద్దని సూచించారు. ఈ నెల 10న బుధవారం మార్కెట్లో క్రయ విక్రయాలు తిరిగి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.