తుంగతుర్తి, సెప్టెంబర్ 21 : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. పోరాటాలే పరమావధిగా బ్రతికిన ధీశాలి కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. స్వాతంత్ర్య ఉద్యమం నుండి మొదలుకుని మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ప్రజా ఉద్యమాల్లో ఆయన పాత్ర మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, మండల నాయకులు గుండగాని దుర్గయ్య, గుండగాని దుర్గయ్య, పూర్ణ నాయక్, గోపగాని రమేష్, గోపగాని శ్రీనివాస్, మల్లెపాక రాములు, బొంకురి మల్లేష్, బొజ్జ సాయికిరణ్, తూం లింగయ్య, తూం రాములు పాల్గొన్నారు.