నల్లగొండ , జూన్ 20: నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం తొలకరి వర్షం కురిసింది. మూడు నెలలుగా తీవ్రమైన ఎండలతో ఇబ్బంది పడ్డ జనం ఈ వర్షంతో కొంత ఊరట చెందారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురువడంతో రైతాంగం సంతోషం కనిపించింది. బుధవారం నుంచి సాగు పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.
వర్షపాతం వివరాలు
జిల్లాలోని చందపేటలో 58.5 మిమీ కురియగా మర్రిగూడలో 25.8, శాలిగౌరారంలో 24.8, హాలియా 21.8, త్రిపురారం 18.3, గుండ్లపల్లి 16.3, నిడమనూర్ 16.0, కొండమల్లేపల్లి 16.0, పెద్ద అడిశర్లపల్లి 12.8, మాడ్గులపల్లి 12.0, తిప్పర్తి 11.3, వేములపల్లి 11.3, చింతపల్లి 8.8, నార్కట్పల్లి 7.0, నాంపల్లి 4.8, అడవిదేవులపల్లి 4.5, నల్లగొండ 4.5, దేవరకొండ 3.8, కేతేపల్లి 3.5, నకిరేకల్ 3.3, గట్టుపల్ 3.3, చండూరు 3.3, చింతపల్లి 2.8, మిరియాలగూడ 2.3, గుర్రంపోడు 1.8, కట్టంగూర్ 0.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు.