రామగిరి, నవంబర్ 30 : తెలంగాణ మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. దీంతో ఇప్పటికే పలు పర్యాయాలు వారు ఆందోళన చేసిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో డిసెంబర్ మొదటి వారం నుంచి దశలవారీగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా విద్యాశాఖ కమిషనర్‌తోపాటు మోడల్ స్కూల్స్ డిప్యూటీ డైరెక్టర్‌కు ప్రోగ్రెసివ్ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(పీఎంటీఏ-టీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీశ్ ఆధ్వర్యంలో వేర్వేరుగా నోటీసులను అందజేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 32 మోడల్ స్కూళ్లల్లో 520మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 17 పాఠశాలలు 270 మంది, సూర్యాపేట జిల్లాలో 9పాఠశాలలు 150 మంది, యాదాద్రిభువనగిరి జిల్లాలో 6 పాఠశాలలు 100మంది పనిచేస్తున్నారు.
పరిష్కరించాల్సిన సమస్యలు ఇవే..
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె
మోడల్స్ స్కూళ్ల టీచర్ల సమస్యలు పరిష్కరించాలని గత 11 సంవత్సరాలుగా ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేస్తున్నా పట్టించుకోవడం లేదు. దీంతో డిసెంబర్ మొదటి వారంలోగా సమ్మెలోకి వెళ్తామని ఉన్నతాధికారులకు తెలియజేశాం. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి తన సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్నా.
– తరాల జగదీశ్, రాష్ట్ర అధ్యక్షుడు, పీఎంటీఏ- టీఎస్