నేరేడుచర్ల, జూన్ 25 : కూల్‌డ్రింక్స్ దుకాణంలో దొంగలు పడి లక్ష నగదు, అర తులం బంగారం రింగ్‌ను అపహరించుకుపోయారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలోని జాన్‌పహాడ్ రోడ్డులో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని జాన్‌పహాడ్ రోడ్డులో మసీద్ ఎదుట ఉన్న జేపీఎస్ కూల్ డ్రింక్స్ షాప్ యజమాని కందిబండ హరిప్రసాద్ తెల్లవారుజామున 5.30 గంటలకు దుకాణం తెరవగా దుకాణంలో ఉన్న వాటర్ బాటిల్స్ చిందర వందరగా పడి ఉన్నాయి.
పరిశీలించగా దొంగలు వెనుక నుంచి గోడ దూకి దుకాణం తలుపులకు ఉన్న బేడాన్ని తొలగించి లోపల ఉన్న బీరువాలోని రూ. 30 వేల నగదుతో పాటు కౌంటర్లోని రూ.70 వేలు, అర తులం బంగారం ఉంగరాన్ని అపహరించుకుపోయినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, క్లూస్ టీమ్‌తో వేలి ముద్రలు సేకరించినట్లు ఎస్ఐ తెలిపారు.