విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
తిరుమలగిరిలో స్కూటర్లు, ల్యాప్‌టాప్‌లు పంపిణీ
తిరుమలగిరి, ఫిబ్రవరి 8 : దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. స్త్రీ, శిశు సంక్షేమ, దివ్యాంగుల శాఖ ఆధ్వర్యంలో ఐదుగురికి మూడు చక్రాల స్కూటర్లు, ముగ్గురికి ల్యాప్‌టాప్‌లు మంజూరు కాగా మంగళవారం తిరుమలగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌తో కలిసి అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పూర్తి వంద శాతం సబ్సిడీపై వీటిని అందజేస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేలా ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతున్నదని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ స్నేహలత, మున్సిపల్ చైర్పర్సన్ పోరాజు రజినీ, మార్కెట్ చైర్మన్ అశోక్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘునందన్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దండు శ్రీనివాస్, సీడీపీఓ శ్రీజ, అంగన్వాడీ సూపర్ వైజర్లు షమీమా, ఖైరున్సిసా, కౌన్సిలర్లు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.