సకల సౌలత్‌ల సర్కారు బడి
స్వరాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా మొదటి విడుతగా ఎంపికైన మైలారంకిందితండా ప్రాథమిక పాఠశాలలో అభివృద్ధి పనులకు రూ.8.45 లక్షలు మంజూరు చేసింది.
- మన ఊరు-మన బడి కింద మైలారంకిందితండా పాఠశాలకు సమకూరిన వసతులు
- హర్షం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు
బొమ్మలరామారం, మార్చి 23 : స్వరాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా మొదటి విడుతగా ఎంపికైన మైలారంకిందితండా ప్రాథమిక పాఠశాలలో అభివృద్ధి పనులకు రూ.8.45 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో పాఠశాలలో గ్రీన్ బోర్డులు, ఫ్యాన్స్, డెస్క్ బెంచీలు, మరుగుదొడ్లకు మరమ్మతులు, గోడలపై ఆకర్షణీయమైన పెయింటింగ్, కొత్త డోర్లు, విండోలు, ప్రహరీ నిర్మాణం, గేటు, కిచెన్ షెడ్డు మాడిఫికేషన్, బిల్డింగ్ లీకేజీ వంటి పనులను పూర్తి చేశారు. తాగునీటి కోసం ఓవర్‌హెడ్ ట్యాంక్, హ్యాండ్‌వాష్ బేసిన్ ఏర్పాటు చేశారు. పాఠశాల గదులకు రంగులు వేశారు. ఇలా సకల సౌలత్‌లతో పాఠశాల కొత్తరూపు సంతరించుకోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెడుతున్నరు
ఇంతకు ముందు పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో ఆకతాయిలు రాత్రివేళ పాఠశాల ఆవరణలో మద్యం తాగి సీసాలు పడేసేవారు. ఇప్పుడు ప్రహరీ నిర్మించి గేటు ఏర్పాటు చేయడంతో ఆ సమస్యకు చెక్‌పడింది. విద్యార్థులకు తాగునీటి ఇబ్బందులు తొలిగిపోయాయి. పాఠశాల కొత్తగా కనిపిస్తుండడంతో విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెడుతున్నారు.
-జంగిటి గోవర్ధన్, ప్రధానోపాధ్యాయుడు
పాఠశాల కొత్తగా కనిపిస్తున్నది
పాఠశాలలో వాటర్ ఫిల్టర్, ఓవర్‌హెడ్ ట్యాంక్, హ్యాండ్‌వాష్‌కు నల్లాలు ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు తీరినయ్. అన్నం తినడానికి ముందు హ్యాండ్‌వాష్‌కు తగినంత నీరు అందుబాటులో ఉంటుంది. పాఠశాలలో డెస్క్ బెంచీలు, గ్రీన్ బోర్డులు, ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేయడంతో పాఠశాల కొత్తగా కనిపిస్తుంది. పాఠశాల ఆవరణ మొత్తం పరిశుభ్రంగా మారింది. -ధీరావత్ అక్షిత, 5వ తరగతి
Thehas launched the Mana Uru-Mana Badi program with an aim to ensure that public schools are properly managed.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

