గరిడేపల్లి, ఏప్రిల్ 25 : దేశ చరిత్రలో నిలిచిపోయేలా బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ మండలాధ్యక్షుడు గుగులోతు కృష్ణనాయక్, హుజూర్నగర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి అన్నారు. గరిడేపల్లిలో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 27న మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ జెండాలను ఎగురవేయాలని, అనంతరం సభకు నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ వైస్ ఎంపీపీ గుత్తికొండ ప్రమీలవెంకటరమణారెడ్డి, నాయకులు మాశెట్టి శ్రీహరి, కీత రామారావు, రాం సైదులు, బొలిశెట్టి సుధీర్, కర్నాటి నాగిరెడ్డి, వెంకటమ్మ శ్రీనివాస్‌రెడ్డి, పిడమర్తి అంజి, పిల్లి అంజయ్య, మామిడి వెంకటేశ్వర్లు, ప్రదీప్‌రెడ్డి పాల్గొన్నారు.
మఠంపల్లి: ఈ నెల 27వ తేదీన వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ మఠంపల్లిలో బీఆర్ఎస్ శ్రేణులు వాల్ పోస్టర్లు అంటించి ప్రచారం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ఇరుగు పిచ్చయ్య, నాయకులు పిండిప్రోలు రామచంద్రయ్య, మన్నెం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కోదాడ రూరల్: తెలంగాణ రాష్ర్టానికి కేసీఆరే శ్రీరామ రక్ష అని కోదాడ పట్టణ 10వ వార్డు మాజీ కౌన్సిలర్ మామిడి పద్మావతి అన్నారు. రజతోత్సవ సభను సక్సెస్ చేయాలని కోరుతూ శుక్రవారం కోమరబండలో వాల్ రైటింగ్ ద్వారా ప్రచారం నిర్వహించి మాట్లాడారు. కార్యక్రమంలో మామిడి రామారావు, వేముల వీరబాబు, సట్టు మురళి, కొర్రపిడతల వీరబాబు, ఎస్కే.నాగులు తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూర్.ఎస్: మండల పరిధిలోని ముక్కుడుదేవులపల్లి, గట్టికల్, పీపానాయక్తండా, బాబోజితండా, రామన్నగూడెం, ఏపూరు, కాశిగూడెం, రామోజీతండా, కందగట్ల, పాత సూర్యాపేట, కోటినాయక్ తండా, దుబ్బతండా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సన్నాహక సమావేశాలను నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తూడి నర్సింహారావు, వీరబోయిన కొమరమల్లు, మడ్డి శ్రీను, వీరన్న, మడ్డి వెంకన్న, యాదగిరి, వెంకన్ననాయక్, శ్రీనునాయక్, శ్రీనివాస్‌రెడ్డి, జగపతినాయక్, బత్తుల ప్రసాద్, ముద్దం కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కోదాడ: ఈ నెల 27న బీఆర్ఎస్ సభను విజయవంతం చేయాలని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు ఉపేందర్‌గౌడ్ కోరారు. ఈ మేరకు శుక్రవారం కోదాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌తోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ నేతృత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మందిని సభకు తరలించనున్నట్లు చెప్పారు.
అర్వపల్లి: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఊరూరా కదిలి రావాలని మండలాధ్యక్షుడు గుండగాని సోమేశ్గౌడ్ కోరారు. మండల పరిధిలోని బొల్లంపల్లి, కొత్తగూడెం, ఉయ్యాలవాడ, సూర్యనాయక్ తండా గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు మన్నె లక్ష్మీనర్సయ్యయాదవ్, బిక్కు వీరన్న, సంజీవ, గోసుల విజయ్‌కుమార్, కాటబత్తిని లక్ష్మీనర్సు, రవీందర్, ఈశ్వర్, నర్సయ్య పాల్గొన్నారు.
మేళ్లచెర్వు: బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బోగాల బాలవెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో మాజీ సర్పంచ్ పందిళ్లపల్లి శంకర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, శంభిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నాగారం: మండల కేంద్రం నాగారంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కల్లెట్లపల్లి ఉప్పలయ్య ఆధ్వర్యంలో చలో వరంగల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గుండగాని అంబయ్య, రైతుబంధు సమితి జిల్లా మాజీ సభ్యుడు పొదిల రమేశ్, మండల నాయకులు కూరం వెంకన్న, చిల్లర చంద్రమౌళి, దోమల బాలమల్లు, ఈరేటి అంజి, మండల యూత్ అధ్యక్షుడు ఈదుల కిరణ్, మాజీ సర్పంచులు యారాల నర్సింహారెడ్డి, చిప్పలపల్లి సోమయ్య, తీగుళ్ల ప్రశాంత్, షేక్ నాగుల్ మీరా, గ్రామశాఖ అధ్యక్షులు కన్నెబోయిన మల్లేశ్, బండగోర్ల యల్లయ్య, ఎలుక సైదులు, తరాల ఆంజనేయులు, మట్టగజం వీరన్న, తీగుళ్ల యాదగిరి, అరుణ్, కన్నెబోయిన మణి, దేవరకొండ మురళి, నాగయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.