దేవరకొండ రూరల్, అక్టోబర్ 06 : దేవరకొండ ఆర్టీసీ డిపో 89 సంవత్సరాలు పూర్తి చేసుకుని నేడు 90వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా డిపో మేనేజర్ తల్లాడ రమేశ్ కేకు కట్ చేసి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1936 అక్టోబర్ 6న నిజాం సర్కార్చే నిర్మించబడిన రెండవ బస్సు డిపో దేవరకొండ బస్సు డిపో అన్నారు (మొట్టమొదటి బస్సు డిపో నార్కట్పల్లి డిపో – 1932లో ప్రారంభం). ఈ తొమ్మిది దశాబ్దాల మహత్తర ప్రయాణంలో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు, ఇతర సిబ్బంది క్రమశిక్షణ, శ్రమ, సేవా దృక్పథం ఎంతో అద్భుతమైనదని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా నాటి ఫోటోలను డిపో మేనేజర్ ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డిపో మేనేజర్ పడాల సైదులు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.
Devarakonda Rural : తొంభై ఏండ్ల ప్రజా సేవాపథం దేవరకొండ బస్ డిపో : డీఎం తల్లాడ రమేశ్