మఠంపల్లి, డిసెంబర్ 22 : మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఉన్న పవిత్ర కృష్ణా నది గతకొన్ని రోజులుగా కాలుష్య కాసారంగా మారింది. కొన్ని రోజులుగా కొం దరు గుర్తు తెలియని వ్యక్తులు అర్థరా త్రి సమయంలో నదిలో విష రసాయనాలు, కలుషితాలు వదిలి వెళ్తున్నారు. దీంతో భక్తులు నదిలో పుణ్యస్నా నాలు ఆచరించే పరిస్థితి లేకుండా పోయింది. వ్య ర్థాలు, విష రసాయనాలను నదిలో కలపడం వల్లో ఈ ప్రాంతమంతా దుర్గంధం వెదజల్లుతోం ది. తెలంగాణ, ఆంధ్ర రా ష్ర్టాల నుంచే కాకుండా తమిళనాడు నుంచి కూడా ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉం టారు. నిత్యం లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులు కనీసం నదిలో కాళ్లు కడుక్కునే పరిస్థితి కూడా లేకుండా పోయింది.
హుజూర్నగర్ నియోజకవర్గంలోని 7మండలాలకు తాగునీరందించే మట్టపల్లి, గుండ్లపల్లి, కిష్టాపురం లిఫ్టులను తాత్కాలికం గా నిలిపివేయడంతో సుమారు 120 గ్రామాలకు నీటి సరఫరా అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మట్టపల్లి గ్రామంలో బోరు నీటిని ట్యాంకర్ల ద్వారా ఇంటింటికి సరఫరా చేస్తున్నా రు. ఈ విషయమై ఆల య అనువంశిక ధర్మకర్తలు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేయడంతో స్థానిక మంత్రి ఉత్త మ్ కుమార్రెడ్డి ఆదేశాలతో కోదాడ డివిజన్ ఎస్ఈ నాగభూషణ్ నదిలోని నీటిని పరిశీలించారు. ఈ సంఘటనకు కారకులైన వ్యక్తులు, పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించా రు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికార యం త్రాంగం బోరు నీటితో భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. వ్యర్థాలతో నదిలోని నీరు ఆకుపచ్చగా మారడమే కాకుండా నదిలోని చేపలు కూడా మృతి చెందుతున్నాయి. దీంతో మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారు.
మూసీ ప్రక్షాళన కారణమా..
రంగారెడ్డి జిల్లా అనంతగిరి కొండల్లో జన్మించిన మూసీ నది హైదరాబాద్ మీదుగా ప్రవహిస్తూ నల్లగొండ జిల్లాలోని వాడపల్లి పుణ్యక్షేత్రంలోని కృష్ణానదిలో కలుస్తుం ది. అయితే మూసీ ప్రక్షాళన వల్ల ఏమైనా విష రసాయనాలు, వ్యర్థాలు ఇక్కడి నీటిలో కలుస్తున్నాయా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. మట్టపల్లి వచ్చే భక్తులు, ఈ ప్రాంత ప్రజలు నదిలోని నీరు కలుషితం కావడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభు త్వం తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన కలుషిత నీటిని శుద్ధి చేయాలని స్థానిక ప్రజలు , భక్తులు కోరుతున్నారు.
100 గ్రామాలకు నిలిచిన నీటి సరఫరా..
నదిలోని నీరు విష రసాయనాల కలుషితం కావడంతో ఆలయానికి వచ్చే భక్తులు, జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా నది నుంచి సుమారు 100 గ్రామాలకు పైగా నీటిని సరఫరా చేస్తున్నాం. నీరు కలుషితం కావడంతో నీటి సరఫరా నిలిచిపోయి ఆయా గ్రా మాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేపల వేటపై ఆధారపడి జీవించే మత్స్యకారులు జీవనాధారం కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నదిలోని నీరు వ్యర్థ రసాయనాలతో కలుషితం కావడంతో ప్రతీ ఇంటికి బోరు నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం. మంత్రి ఆదేశాలతో ఇరిగేషన్ శాఖ అధికారులు నదిలోని నీటిని పరిశీలించారు. త్వరితగతిన నీటిని శుద్ధి చేసి, స్వచ్ఛమైన నీటిని అందించాలని కోరుతున్నాం.
-రామిశెట్టి విజయశాంతీఅప్పారావు, సర్పంచ్, మట్టపల్లి
తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం..
ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటే కృష్ణా నది నీరు ఇప్పుడు విష రసాయనాలు, వ్యర్థాలతో కలుషితమై వినియోగించేందుకే వీలు లేకుం డా పోయింది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. ఇన్ని సంవత్సరాల చరిత్రలో నదిలోని నీరు ఎప్పుడూ స్వచ్ఛం గా ఉండేది. ఇప్పుడు విష రసాయనాలు, వ్యర్థాలతో నదిలోని కలుషితం కావడం చాలా బాధగా ఉంది. ప్రక్షాళన వల్ల హైదరాబాద్లోని మూసీ నది నీరు కలుషితమై ఇటుగా వస్తున్నాయా…అనే అనుమానాలు కూడా ఉన్నాయి. నేటి వరకూ సమస్య పరిష్కారం కాకుండా ఉంది. దీంతో భక్తుల, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
-ఆలేటి రమేశ్, మట్టపల్లి గ్రామం