ఆలేరు, ఫిబ్రవరి 12 : సమైక్య పాలనలో గతి తప్పిన కులవృత్తులకు స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ చేయూత ఇస్తున్నది. వృత్తిని నమ్ముకుని జీవించే వృత్తిదారుల సంక్షేమానికి సమగ్ర చర్యలు చేపడుతున్నది. రజక, నాయీబ్రాహ్మణుల కోసం ప్రభుత్వం ప్రతి నెలా 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది. దాంతో ఆయా కులాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యుత్ భారం తగ్గింది. హెయిర్ సెలూన్ నిర్వహణలో భాగంగా ప్రతి నెలా విద్యుత్ బిల్లులు చెల్లించడం భారంగా ఉండేది. ఇంటి కిరాయి, కరెంటు బిల్లు, వర్కర్ల జీతాలు ఇచ్చేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కష్టకాలంలో ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించడం సంతోషకరం. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు ధన్యవాదాలు.
-సిద్ధూ, హెయిర్సెలూన్ యజమాని, ఆలేరు
వృత్తిదారుల సంక్షేమం, సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం. గత పాలకులు వృత్తిదారుల సంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. చేతి వృత్తిదారుల కోసం ఉచిత విద్యుత్ అందించడం సంతోషకరం. వృత్తిదారులంతా తెలంగాణ ప్రభుత్వం వెంటే ఉంటారు. ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు సర్వదా రుణపడి ఉంటాం. -గణేశ్, లాండ్రీషాపు ఓనర్, ఆలేరు