నిడమనూరు, నవంబర్ 24 : మహిళల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడ పడుచులకు తెలంగాణ ప్రభుత్వం పెట్టిన సారెను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేసిన ఘనత ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముంగి శివమారయ్య, కొండా శ్రీనివాస్ రెడ్డి, నర్సింగ్ విజయ్ కుమార్, నందికొండ మట్టారెడ్డి, ఆలంపల్లి మైసయ్య, కొప్పోలు స్వర్ణలత, పోలె రవి, మేరెడ్డి వెంకట రమణ, ఆలంపల్లి ప్రసాద్, రూపని కృష్ణ, సిరిశాల యాదగిరి పాల్గొన్నారు.