నిడమనూరు, జూన్ 19 : దీర్ఘకాలంగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించడమే భూ భారతి చట్టం ముఖ్య ఉద్ధేశ్యమని నిడమనూరు తాసీల్ధార్ జంగాల కృష్ణయ్య అన్నారు. మండలంలోని ముప్పారం గ్రామ రైతు వేదికలో గురువారం రెవెన్యూ సదస్సును ప్రారంభించి మాట్లాడారు. భూ సమస్యల్లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా సోమోరి గూడెం, ముప్పారం, గుంటుకగూడెం, గౌండ్లగూడెం గ్రామాల రైతులు పెద్ద ఎత్తున దరఖాస్తులు అందజేశారు. అధికారులు దరఖాస్తులను స్వీకరించి రసీదులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నిడమనూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం, గిర్ధావర్లు సందీప్, దాడి రాజిరెడ్డి, నాయకులు ముంగి శివమారయ్య, కొండా శ్రీనివాస్‌రెడ్డి, ఆలంపల్లి మైసయ్య, కోట్ల సైదులు, మేరెడ్డి వెంకటరమణ, చరక శ్రీను, ఆలంపల్లి ప్రసాద్, నర్సింహ్మ, గంగాధర్, మల్లప్ప, పాపయ్య, శ్రీను పాల్గొన్నారు.