రామగిరి, ఆగస్టు 25 : భవిష్యత్ అంతా నానో టెక్నాలజీదేనని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ టి.రాధాకృష్ణన్, నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దోమల రమేశ్ అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో జీవశాస్త్రాల విభాగాల ఆధ్వర్యంలో “సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు -జీవశాస్త్రాల పాత్ర” అనే అంశంపై సోమవారం జరిగిన జాతీయ సదస్సును వారు హాజరై సెమినార్ సావర్ ఆవిష్కరణ చేశారు. అనంతరం రాధాకృష్ణన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా “నానో మెటీరియల్స్ అండ్ ది కెమిస్ట్రీ కనెక్షన్” అనే అంశంపై వివరించారు. నానో పార్టికల్స్ సంశ్లేషణలో రసాయన శాస్త్రం అనుసంధానం, నానో కాంపోజిట్ల అభివృద్ధి, ఉత్ప్రేరకం, సెన్సార్లు, ఆరోగ్య సంరక్షణ, స్థిరమైన ఇంధన పరిష్కారాల్లో వాటి విస్తృత శ్రేణి అనువర్తనాలపై వివరించారు. ఈ అత్యాధునిక అనువర్తనాలు ఐక్యరాజ్యసమితి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలతో నేరుగా అనుసంధానించబడి ఉన్నాయని, తద్వారా నానో టెక్నాలజీ స్థిరమైన పురోగతికి ఒక శక్తివంతమైన సాధనంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
జాతీయ సెమినార్ కో ఆర్డినేటర్ డా.ఎం.అనిల్ కుమార్ సదస్సు లక్ష్యాలను వివరించారు. ఈ సదస్సు పరిశోధకులకు, అధ్యాపకులకు, విద్యార్థులకు అర్థవంతమైన విద్యా అవగాహనకు వేదికగా నిలుస్తుందని తెలిపారు. నానో మెటీరియల్స్, స్థిరమైన అభివృద్ధి రంగంలో మరింత ఆవిష్కరణలకు స్ఫూర్తినిస్తుందన్నారు. అదే విధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రసాయనశాస్త్ర విభాగం ప్రొఫెసర్ డా.రామాచారి స్థిరమైన అభివృద్ధికి జీవశాస్త్రాల పాత్రను వివరించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా.అంతటి శ్రీనివాస్, అకాడమిక్ కో ఆర్డినేటర్ డా.రవికుమార్, ఐక్యూఏసి కో ఆర్డినేటర్ డా.ప్రసన్నకుమార్, బి.నాగరాజు, డా.బొజ్జ అనిల్ కుమార్, డా.జ్యోత్స్న, అధ్యాపకులు శివరాణి, డా. వెల్దండి శ్రీధర్, డా.భాగ్యలక్ష్మి, డా.మల్లేశం, సుధాకర్, డా.మునిస్వామి, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
Ramagiri : భవిష్యత్ నానో టెక్నాలజీదే : హెచ్సీయూ ప్రొఫెసర్ రాధాకృష్ణన్