నీలగిరి, మే 25 : నల్లగొండ పట్టణలోని ఐటీ హబ్ జిల్లా చరిత్రలో నిలిచేలా నిర్మిస్తున్నట్లు నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని ఐటీ హబ్ వద్ద గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లగొండ ఐటీ హబ్‌లో కార్యాలయాల ఏర్పాటుకు 16 కంపెనీలు ఇప్పటికే ఒప్పందం చేసుకున్నాయని పేర్కొన్నారు. ఐటీ హబ్‌తో 3 వేల మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. నల్లగొండ మెడికల్ కళాశాల భవనం కూడా పూర్తి కావొస్తుందని కళాశాలకు సంబంధించి ప్రొఫెసర్, డీన్లు, డాక్టర్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు.
నల్లగొండ పట్టణంలో అమృత్ 2.0 కింద వాటర్ సప్లయ్ ప్యాకేజీకు రూ. 491.39 కోట్లు, అదనపు పైప్ లైన్, ట్యాంక్‌ల నిర్మాణానికి కేటాయించిన రూ.56.75 కోట్లు, సీవరేజ్ ప్రాజెక్ట్ (యుజీడీ) కోసం రూ. 216.19 కోట్లు కేటాయిస్తూ జీఓలు విడుదల చేసిందన్నారు. వీటికి త్వరలో టెండర్లు పూర్తి చేసి పనులు నిర్వహించనున్నట్లు తెలిపారు. నల్లగొండ పట్టణంలో రూ.1300 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని దీనిపై క్లాక్ టవర్ సెంటర్లో మేధావుల సమక్షంలో బహిరంగ చర్చకు తాను సిద్ధ్దంగా ఉన్నానని కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. నల్లగొండ అభివృద్ధిని చూసి వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వాదించాలని కోరారు.
సీఎం కేసీఆర్ దత్తతతో… దశ తిరిగిన నల్లగొండ
సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీ మేరకు దత్తత తీసుకోవడంతో నల్లగొండ దశ తిరిగిందని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణాభివృద్ధ్దిని ప్రజలు సంబురపడుతున్నారని అన్నారు. అలాగే 1951సంవత్సరంలో అప్పట్లో 1500మంది విద్యార్థుల కోసం ఎన్జీ కళాశాల భవనం నిర్మిస్తే దాన్ని ఎవరూ పట్టించుకోలేదని, సమస్యను గుర్తించిన సీఎం కేసీఆర్ గుర్తించి 5,500 మంది విద్యార్థుల కోసం రూ.36 కోట్లతో కళాశాల భవనాన్ని ఆధునీకరిస్తున్నారని తెలిపారు. జూన్ మొదటి వారంలో మంత్రి కేటీఆర్ నల్లగొండలో పర్యటిస్తారని మరో రూ. 139 కోట్లతో పలు అభివృద్ధ్ది పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు.
అభివృద్ధిపై విజిలెన్స్‌తో విచారణ చేయిస్తా
నల్లగొండ పట్టణంలో రూ.1300 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతుంటే కాంగ్రెస్ నాయకుల కండ్లకు కనబడట్లేదని, వారు అభివృద్ధ్ది నిరోధకులుగా మారారన్నారు. అనవసర విషయాల్లో తనను లాగి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తనపై అభాండాలు వేసే వాళ్లకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. పట్టణ సుందరీకరణ పనులపై తానే విజిలెన్స్‌తో విచారణ చేయిస్తానన్నారు.
కోమటిరెడ్డి అన్నదమ్ములను ప్రజలు నమ్మరు
పూటకో మాట, రోజుకో పార్టీ మారే కోమటిరెడ్డి అన్నదమ్ములను జిల్లా ప్రజలు ఎవరూ నమ్మరని విమర్శించారు. మంత్రిగా ఉండి జిల్లా ప్రజలకు ఆయన తేలేని ఐటీ హబ్, మెడికల్ కాలేజ్, బత్తాయి మారెట్ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. బత్తాయి మారెట్ ప్రారంభం రోజు తానే మార్కెట్ తెచ్చానని చెప్పడంతో ప్రజలు ఆయన అనుచర గణాన్ని కిలోమీటర్ల దూరం తరిమి కొట్టిన విషయం మరిచిపోవద్దని గుర్తు చేశారు. కోమటిరెడ్డికి వచ్చే ఎన్నికల్లో 50 వేల మెజార్టీ కాదు రాదని ఎద్దేవా చేశారు. జిల్లా ప్రజలు చాలా చైతన్యవంతులని అభివృద్ధికి పట్టం కడుతారని తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని నల్లగొండ ప్రజలు ఎప్పుడో దూరం పెట్టారని ఆయన మురిగిన కోడిగుడ్డు, చెల్లని రూపాయితో సమామని పేర్కొన్నారు. నల్లగొండ పట్టణ అభివృద్ధ్దిపై గడియారం సెంటర్లో మేధావుల ముందు తేల్చుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు సవాల్ విసిరారు.
సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, కనగల్, తిప్పర్తి ఎంపీపీలు కరీంపాషా, విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్‌యాదవ్, పీఏసీఎస్ చైర్మన్లు వంగాల సహదేవ్‌రెడ్డి, అలకుంట్ల నాగరత్నంరాజు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, కౌన్సిలర్లు ఖయ్యూం బేగ్, ఆలకుంట్ల మోహన్ బాబు, పున్న గణేశ్, ఎడ్ల శ్రీనివాస్, పబ్బు సందీప్, జెర్రిపోతుల భాసర్ గౌడ్, ఊటూరు వెంకట్‌రెడ్డి, వట్టిపల్లి శ్రీనివాస్, మహమ్మద్ ఇబ్రహీం, మారగోని గణేశ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షడు బోనగిరి దేవేందర్, నాయకులు సందినేని జనార్దన్‌రావు, కొండూరు సత్యనారాయణ, నిరంజన్ వలీ, సుంకరి మల్లేశ్ గౌడ్, కటికం సత్తయ్య గౌడ్, బొర్ర సుధాకర్, బక పిచ్చయ్య, సింగం రామ్మోహన్, బకరం వెంకన్న జమాల్ ఖాద్రి, పల్రెడ్డి రవీందర్ రెడ్డి, దేప వెంకట్ రెడ్డి, అయితగోని యాదయ్య, తిప్పర్తి వైస్ ఎంపీపీ ఏనుగు వెంకట్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి, సింగం లక్ష్మి, సంకు ధనలక్ష్మి, దుబ్బ రూప, తలారి యాదగిరి, గంజి రాజేందర్ పాల్గొన్నారు.