నల్లగొండ : కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు ఉద్యమ ఆగదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆరెస్ పార్టీ శ్రేణులు, రైతన్నలతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైతులు పండించిన యాసంగి వడ్లను బీజేపీ కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని, కేంద్రం మెడలు వంచేదాకా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టువదలడని ఆయన హెచ్చరించారు.