రామగిరి, మే 18 : తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగుల సంఘం హైదరాబాద్ ఎన్నికలు సోమవారం నల్లగొండ జిల్లా కోర్టులో జరిగాయి. అధ్యక్షుడిగా సీహెచ్.రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మాతంగి వీరబాబు, కోశాధికారిగా పి.నరేశ్, అసోసియేట్ ప్రెసిడెంట్గా కె.శ్రావణ్ కుమార్, ఉపాధ్యక్షులుగా డి.మదుసూదన్రావు, కెఈ వంశీలత, కె.గోపినాథ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా జి.కోటేశ్వర్రెడ్డి, సహాయ కార్యదర్శులుగా జె.భుజంగరావు, ఎస్.మల్లికార్జున్ గౌడ్, ఎం.కోమరయ్య ఎంపికయ్యారు. ఎన్నికల అధికారులుగా కె.వెంకట్ రెడ్డి, బివి రామోహన్రావు వ్యహరించారు. నూతన కమిటీకి న్యాయ శాఖ ఉద్యోగులు అభినందనలు తెలిపారు.