మునుగోడు, ఏప్రిల్ 24 : అమాయక ప్రజల మీద ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అని, కశ్మీర్లో పర్యాటకుల మీద జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం, డివైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి అన్నారు. కశ్మీర్లో ఉగ్రవాదుల దాడులకు నిరసనగా గురువారం మునుగోడు మండల కేంద్రంలో డివైఎఫ్ఐ, సిపిఎం, సిఐటియూ మండల కమిటీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేప్టట్టి మృతులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కశ్మీర్ ప్రజలతో పాటుగా దేశ ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలమైందన్నారు.
ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించి ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలని, దేశ సమైక్యత, సమగ్రత కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, ప్రాణ నష్టం జరగకుండా కేంద్ర ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సాగర్ల మల్లేశ్, సిఐటియూ మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు, చండూరు మండల కన్వీనర్ జేరిపోతుల ధనుంజయ, సిపిఎం మండల కమిటీ సభ్యులు వడ్లమూడి హనుమయ్య, యాసరాని శ్రీను, మిరియాల భరత్, కొంక రాజయ్య, దేవగోని రాజు, కాంతయ్య, డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు బొడ్డుపల్లి నరేశ్, టౌన్ కార్యదర్శి యాట శ్రీకాంత్, నారగోని నరసింహ పాల్గొన్నారు.