తిరుమలగిరి అక్టోబర్ 17: తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు ఎమ్మెల్యే మందుల సామేల్ శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత రైతులు తమ అసైండ్ పట్టా భూముల్లో భూమి పూజ చేయవద్దని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తామని మొదటి విడుతలో రాష్ట్రంలో నాలుగు నియోజకవర్గాల్లో యంగ్ ఇం డియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రకటించింది. ఇందులోభాగంగా తిరుమలగిరి మండల పరిధిలోని తొండ గ్రామంలో సర్వే నెంబర్ 98లో 22 ఎకరాల ప్రభుత్వ భూమిలో రూ.200 కోట్లతో గతేడాది అక్టోబర్ 6న ఎమ్మెల్యే మందుల సామేల్ ఆధ్వర్యంలో పాఠశాల కోసం శంకుస్థాపన చేశారు.
30 ఏండ్ల క్రితం ప్రభుత్వం ఈ సర్వే నెంబర్లో రైతులు చిత్తలూరి కృష్ట, చిత్తలూరి సోమయ్య, చిత్తలూరి సురేశ్, పోరెల్ల వేణు, పోరెల్ల పెంటయ్య కుంటుంబాలకు సుమారు 7 ఎకరాలు భూమి ఇచ్చింది. కాగా శుక్రవారం వీరి భూముల వైపు తిరిగి రెండోసారి భూమి పూజ నిర్వహించటంతో రైతులు ఆందోళనకు దిగారు. గతేడాది వేరేచోట భూమి పూజ నిర్వహించి మళ్లీ ఇప్పుడు మా భూములను లాక్కుంటే ఎలా అని రైతు కుటుంబాలు ఆందోళనకు దిగారు. అభివృద్ధికి మేము అడ్డుపడం. కానీ, మాకు భూమికి బదలు భూమి చూపించాలి లేదా పరిహారం అయినా ఇప్పించాలంటూ రైతు కుటుంబాలు ఎమ్మెల్యేతో వాదనకు దిగారు. దీంతో పోలీసులు రైతులను ముందస్తు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించే ప్రయ త్నం చేశారు.
దీంతో రైతు కుటుంబాలు పెట్రోల్ డబ్బాలతో ఆత్మహత్యాయత్నం చేయటానికి ప్రయత్నించారు. పోలీసుల వా హనం ఎదుట బైఠాయించారు. మాకు ఇచ్చిన భూ ముల్లో సేద్యం చేసుకుంటున్నామని వాదించారు. ప్రభు త్వం ఇచ్చిన భూమిని ప్రభుత్వమే లాక్కుంటే.. మేము ఎలా బతకాలి అని, మాకు మరో మార్గం చూపించాలని వేడుకున్నారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారి తీసింది. చివరికి పోలీసులు వారిని బలవంతగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. భూమి పూజ అనంతరం వారిని వదిలి పెట్టారు. ఎలాంటి సమాచారం, నోటీసులు ఇవ్వకుండా మా భూములను ఎలా లాక్కుంటారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ హరిప్రసాద్, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదిత రులు పాల్గ్గొన్నారు.