– బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తండు సైదులు గౌడ్
– మామిడాల రాములోరి గుడికి లక్షన్నర ఆర్థిక సాయం
తిప్పర్తి, మార్చి 25 : ఆలయాల నిర్మాణం, పూజలతో సమాజంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, తిప్పర్తి మాజీ జడ్పీటీసీ, చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తండు సైదులు గౌడ్ అన్నారు. బుధవారం తిప్పర్తి మండల పరిధిలోని మామిడాలలో గల రామాలయ ధ్వజ స్థంభ నిర్మాణానికి ఆయన రూ.1.50 లక్షల ఆర్థిక సాయం అందించి మాట్లాడారు. మానవులందరూ భక్తి భావంపై దృష్టి పెట్టడంతో చెడు నుండి మంచి వైపు నడుస్తారని, దీంతో మానసిక ప్రశాంతత నెలకొంటుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించబడిందని దాంతో గత పదేండ్లుగా రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండగా ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఎంతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలే సరైన గుణపాఠం చెప్పి మరోసారి బీఆర్ఎస్కు పట్టం కడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కొత్తపల్లి సైదులు, మాజీ సర్పంచ్ మొకిరాల కృష్ణ, ఉప సర్పంచ్ బుల్లెట్ శరత్ బాబు, నాయకులు అబ్బగోని చెన్నకేశవులు, సైదులు, అంతటి చెన్నకేశవులు, శ్రీను, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.