కోదాడ, డిసెంబర్ 03 : తెలంగాణ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి ప్రాణత్యాగంతోనే మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని, రాష్ట్ర ఆవిర్భావానికి ఆయన త్యాగమే ప్రధాన కారణమని బీఆర్ఎస్ కోదాడ పట్టణాధ్యక్షుడు ఎస్.కె నయిమ్ అన్నారు. శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా బుధవారం కోదాడ ప్రధాన రహదారిపై గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నయీమ్ మాట్లాడుతూ.. శరీర మంటలతో భగభగ మండుతున్నప్పటికీ శ్రీకాంతాచారి తెలంగాణ నినాదాలు చేస్తూ ప్రాణ త్యాగం చేశాడని కొనియాడారు. ఆయన త్యాగం మరువలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మేదర లలిత, పిట్టల భాగ్యమ్మ, సంపేట ఉపేందర్, గొర్రె రాజేశ్, గోపాల్, దస్తగిరి గోపి, చలిగంటి వెంకట్, జానీ, పట్టణ నాయకులు పాల్గొన్నారు.