నాగారం, ఏప్రిల్ 11 : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి.. నాన్నపై ప్రేమతో తన తండ్రికి ఎండ తగులకుండా గొడుగుపట్టి పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. మంగళవారం సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఇద్దరూ కలియతిరిగి పంటలను పరిశీలించారు. ఈ సమయంలో మండే ఎండలను సైతం లెక్క చేయకుండా వడివడిగా తిరుగుతున్న 80వ దశకంలో ఉన్న తన తండ్రి గుంటకండ్ల రామచంద్రారెడ్డికి గొడుగు పట్టి తోడుగా మంత్రి నడిచారు. తండ్రికి గొడుగు పట్టి వ్యవసాయ క్షేత్రంలో తిరుగడం ఎంతో సంతోషాన్నిచ్చిందని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు.