భువనగిరి కలెక్టరేట్, సెప్టెంబర్ 10 : గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని 16వ ఆర్థిక సంఘం సభ్యుడు అజయ్ నారాయణ ఝౌ అన్నారు. భువనగిరి మండలం అనంతారం గ్రామాన్ని మంగళవారం 16వ ఆర్థిక సంఘం సభ్యులు అజయ్ నారాయణ ఝా, మనోజ్ పాండా, జాయింట్ సెక్రెటరీ కేకే మిశ్రా, జాయింట్ డైరెక్టర్ దావిందర్ చోడా, డిప్యూటీ డైరెక్టర్ అభిషేక్ నందన్, అసిస్టెంట్ డైరెక్టర్ భద్భేష్ హజారిక సందర్శించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలు బోనాలతో వారికి ఘన స్వాగతం పలికారు. గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల మహిళలతో వారు ముచ్చటించారు. గ్రామ పంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల అధ్యయనానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చామని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు మోడల్‌గా నిలిచిందని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా గ్రామ పంచాయతీలో పనులు బాగా జరుగుతున్నాయని, రాబోయే 16వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా ఇంకా అభివృద్ధి పనులు చేపట్టాలని చెప్పారు. దేశంలో ఆరోగ్యం, విద్యా రంగాల్లో సేవలు ఇంకా పెరుగాల్సి ఉందని, అంగన్వాడీల్లో మహిళల అభ్యున్నతి కోసం ఇంకా ఎకువ పనులు చేపట్టాల్సి ఉందని తెలిపారు. గ్రామ పంచాయతీలు స్వతంత్రంగా తమ నిర్ణయాలను తామే తీసుకునే స్థితికి రావాలన్నారు. కలెక్టర్ హనుమంతు కె.జెండగే మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చిన నిధులను పారిశుధ్యం, తాగునీటికి వినియోగించామని తెలిపారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లను అప్ గ్రేడ్ చేస్తున్నామని చెప్పారు.
సభలో సమాఖ్య మహిళలు ప్రభుత్వం అందిస్తున్న లబ్ధి ద్వారా తాము చేపట్టిన పనులను వివరించారు. అంతకుముందు పల్లె దవాఖానను ఆర్థిక సంఘం సభ్యులు సందర్శించి గ్రామీణులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. గ్రామంలో నిర్వహిస్తున్న స్వచ్ఛదనం- పచ్చదనం, పారిశుధ్యం కార్యక్రమాలపై ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. జిల్లా ప్రజా పరిషత్ హైసూల్లో నిర్మించిన అదనపు తరగతులను పరిశీలించారు. పాఠశాల చిన్నారులతో ముచ్చటించారు. పాఠశాల ఆవరణలో మొకలు నాటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షే మ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కె. గంగాధర్, జిల్లా పరిషత్ ము ఖ్య నిర్వహణ అధికారి శోభారాణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడి,్డ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి యశోద, జిల్లా పంచాయతీ అధికారి సునంద, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శామ్యూ ల్, జిల్లా విద్యాశాఖ అధికారి నరసింహ, డీఆర్డీఓ సురేశ్, అనంతారం మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.